రూ. 500 లకే ఏపీ ప్రెసిడెంట్ మెడల్ ?

ఏపీ సర్కార్‌ పై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చానని… పొలంలో కలుపు మొక్కలను పీకినట్టు.. రాజకీయాల్లో కలుపు మొక్కలను పీకేస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఏపీ లో వైసీపీ పాలన దారుణంగా ఉందన్నారు. రూ. 500 ఇస్తే ఏపీ ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ వస్తోందని… మద్యం అమ్మకాలపై చురకలు అంటించారు పవన్‌ కళ్యాణ్‌. ప్రజా సమస్యలపై ప్రశ్నించి ప్రతి సన్నాసితో తిట్టించుకోవడం తన సరదానా..? ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు.

తనన్ను తిడితే కుంగిపోతారనుకుంటారేమో.. మరింత బలపడతా..?అని తెలపారు. ప్రతి ఒక్కర్నీ గుర్తుంచుకుంటానని… పథకాలకు ఆ అన్న పథకం.. పెద్దన్న పథకం అంటూ పేర్లేంటీ..?అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల్లో కోతలు విధిస్తే మేం అడగమా..? అని నిలదీశారు. అడుగుతున్నారని కోడి కత్తి గ్యాంగులతో అరచాకాలు సృష్టిస్తారా..? నాకేమన్నా థియేటర్లు ఉన్నాయా..? మీ వైసీపీ నేతలకే ఉన్నాయని మండిపడ్డారు. సినిమా టిక్కెట్లు ఎంతైనా పెట్టుకోని చావండి.. తనకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లు.. పిసినారులు.. పినాసులు అని.. తినే చేత్తో కాకిని కూడా ముట్టరని మండి పడ్డారు. తాను అంబేద్కర్‌ను గౌరవిస్తా.. సుభాష్‌ చంద్ర బోసుకు తలవంచుతా కానీ.. వైసీపీ లాంటి వాళ్ల తాట తీస్తానని హెచ్చరించారు పవన్‌ కళ్యాణ్‌.

-Advertisement-రూ. 500 లకే ఏపీ ప్రెసిడెంట్ మెడల్  ?

Related Articles

Latest Articles