కుటుంబ సభ్యులను కించపరచటం తగదు: పవన్‌ కళ్యాణ్‌

కుటుంబ సభ్యులను కించపరటం తగదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదన కలిగి స్తున్నాయన్నారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చే స్తుంటే ప్రజా ప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమ ర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరంగా ఉందని, ప్రజా సం క్షేమం నాయకులకు పట్టదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని చంద్రబాబు కంట తడి పెట్టడం బాధాకరమని పవన్‌ తెలిపారు.

ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించేలా చేస్తాయని, గౌరవమైన పదవుల్లో ఉండి ఇలా మాట్లడటం సబబు కాదని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.ఈ మధ్యకాలంలో సభలు, సమావేశాలు చర్చల్లో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్య సమా జం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోందని, వ్యక్తిగత దూష ణలకు దిగడం సమంజసం కాదన్నారు. ప్రతిపక్ష నేత కుటుంబస భ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను నిర్హేతుకంగా ఖండిస్తున్నాని పవన్‌ అన్నారు.

సీఎం జగన్ కుటుంబసభ్యులను తక్కువ చేసి కొందరు మాట్లాడినప్పుడు ఆనాడు కూడా ఆ వ్యాఖ్యలను ఇదే రీతిలో ఖండించాం. ఎవ్వరూ ఎవరి పై వ్యక్తిగత దూషణలకు చేయోద్దని బాధ్యతయుతమైన పదవుల్లో ఉండి ఇలా మాట్లాడటం సరికాదని ఇప్పటికైనా తమ నోటి దురుసును తగ్గించుకుంటే మంచిదన్నారు. ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతా యుతమైన స్థానాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుందని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles