సమయం ఆసన్నమయింది: పవన్ కళ్యాణ్

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాయి. వైసీపీ-జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సినిమా ఫంక్షన్‌లో పవర్‌ స్టార్ రెచ్చిపోతే, మీడియా ముందు వైసీపీ ప్రశ్నప్రశ్నకు కౌంటర్ ఎటాక్‌‌ ఇచ్చింది. దీంతో పవర్‌ స్టార్‌ అభిమానులు, జనసైనికులు కూడా సోషల్ మీడియాలో యుద్ధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు.

కాగా, నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా పవన్‌ కల్యాణ్‌పై పదునైన విమర్శలు చేశారు. అయితే, సోషల్‌ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ, ఓ పద్యం రూపంలో..

‘తుమ్మెదల ఝుంకారాలు..
నెమళ్ళ క్రేంకారాలు..
ఏనుగుల ఘీంకారాలు..
వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే…’

అంటూ మరింత ఘాటుగా పవన్ ట్వీట్‌ చేశారు, అంతే కాదు.. నాకు ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అంటూ.. “హూ లెట్ ది డాగ్స్ అవుట్” సాంగ్‌ లింక్‌ను పవన్‌ షేర్‌ చేశారు. అయితే దీనికి మరోసారి పేర్నినాని కౌంటర్ ఇవ్వడంతో వైసీపీ-జనసేన మధ్య వార్ మరింత వేడెక్కింది.

అయితే తాజాగా పవన్ ప్రభుత్వాన్ని ఉగ్రవాదంతో పోల్చారు. ‘వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’ కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..’ అంటూ పవన్ హెచ్చరించాడు. పవన్ రీసెంట్ గా వైసీపీ హామీలపై జనసేన ఛార్జిషీట్‌ వెయ్యడంతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వార్ చూస్తుంటే ఇప్పట్లో చల్లబడేలా కనిపించడం లేదు.. పవన్ అక్టోబర్ 2 నుంచి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీపై దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మత్తు చేసే కార్యక్రమం చేపట్టడంతో వైసీపీ-జనసేన వార్ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.

-Advertisement-సమయం ఆసన్నమయింది: పవన్ కళ్యాణ్

Related Articles

Latest Articles