పెరుగుతోన్న కరోనా కేసులు.. అక్కడ మళ్లీ కర్ఫ్యూ…

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మళ్లీ మహమ్మారి పెరుగుతోంది… ఇక, జమ్ములోనూ రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పైకి కదులుతోంది.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు కర్ఫ్యూ విధించారు… కరోనా కట్టడిలో భాగంగా.. ఇవాళ్టి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉటుందని.. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు..

Read Also: సెంచరీ కొట్టిన టమాటా ధర..

కోవిడ్‌ పాజిటివిటీ రేటును కట్టడి చేసేందుకే నైట్ కర్ఫ్యూ విధించామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు స్థానిక అధికారులు.. ఇక, ప్రజలంతా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించిన అధికారులు… కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. అయితే, కరోనా కేసులు అదుపులోకి రాకపోతే.. లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో కూడా జమ్ము సిటీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Related Articles

Latest Articles