పోలీసుశాఖ కీల‌క నిర్ణ‌యం: రాళ్లు రువ్వితే ఉద్యోగాల‌కు అన‌ర్హులు…

జ‌మ్మూక‌శ్మీర్ పోలీసు శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఎవ‌రైతే రాళ్లు రువ్వుతారో, విద్రోహ కార్య‌క‌లాపాల్లో పాల్గొంటారో వారికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు రాకుండా చేయాల‌ని పోలీసుశాఖ ఆదేశాలు జారీ చేసింది.  దీంతోపాటుగా, దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించే వ్య‌వ‌హారాల్లో పాల్గొనే వ్య‌క్తులు విదేశాల‌కు వెళ్ల‌కుండా చూడాల‌ని, అలాంటి వారికి పాస్‌పోర్ట్ జారీ చేయ‌కూడ‌ద‌ని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది.  పాస్‌పోర్ట్, ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు సంబందించి దృవీక‌ర‌ణ పత్రాల ప‌రిశీల‌న స‌మ‌యంలో వీటిని కూడా ప‌రిశీలించాల‌ని పోలీసు శాఖ పేర్కొన్న‌ది.  ఒక వ్య‌క్తి ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాడా లేదా అన్న‌ది స్థానిక పోలీస్ స్టేష‌న్ నుంచి స‌మాచారం తీసుకోవాల‌ని, అవ‌స‌ర‌మైతే సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా ప‌రిశీలించాల‌ని పోలీస్ శాఖ పేర్కొన్న‌ది.  స్థానిక పోలీస్ స్టేష‌న్ రికార్డుల్లో దీనికి సంబందించిన విష‌యాల‌ను రికార్డు చేసి ఉంచాల‌ని ఆదేశించింది.  

Read: వినోదం పంచుతూ విజ‌యం

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-