వయస్సు పైబడ్డ జేమ్స్ బాండ్ కు… ఈ సారి సెటైర్లు, పంచులు తప్పవట!

‘నో టైం టూ డై’… బాండ్ మూవీస్ చరిత్రలో 25వ చిత్రం! అంతే కాదు, ప్రస్తుత బాండ్ డేనియల్ క్రెయిగ్ కి చివరి సినిమా కూడా! ఇక మీదట జేమ్స్ బాండ్ గా తాను ఉండనని ఆయన ఇప్పటికే చెప్పేశాడు. అయితే, అనేక వాయిదాల తరువాత కరోనా మహమ్మారి నేపథ్యంలో ‘నో టైం టూ డై’ సెప్టెంబర్ 30న బ్రిటన్ లో, అక్టోబర్ 8న అమెరికాలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా లెటెస్ట్ బాండ్ మూవీపై అనేక చర్చలు, ప్రచారాలు జరుగుతున్నాయి…

‘నో టైం టూ డై’ సినిమాలో జేమ్స్ బాండ్ రిటైర్ మెంట్ ప్రకటించి మళ్లీ తిరిగి వస్తాడు. అతడికి సహకరించే పాత్రలో హాలీవుడ్ నటి యానా డీ అర్మాస్ కనిపిస్తుంది. ఆమె కథలో ఒక సీఐఏ ఏజెంట్. కేర్ ఫ్రీగా, బబ్లీగా కొనసాగుతుంది తన క్యారెక్టర్. ఇక మిస్ డీ అర్మాస్ పాత్ర సినిమాకి గ్లామర్ తీసుకురావటమే కాదు అవసరమైనప్పుడల్లా ట్విస్టులు, యాక్షన్ కూడా వెంట తెస్తుంది. కానీ, ఇదంతా ఒక ఎత్తైతే యానా పాత్ర ద్వారా బాండ్ పైన సెటైర్లు వేయించటం ‘నో టైం టూ డై’ సినిమాలోని ప్రత్యేకత!

సాధారణంగా బాండ్ అనగానే ప్రపంచం మొత్తం గౌరవం ఇస్తుంది. అలెర్ట్ గా ఉంటుంది. కానీ, ఈసారి జేమ్స్ బాండ్ రిటైర్ అయ్యి మళ్లీ తిరిగి డ్యూటీలోకి వచ్చాడు. కాస్త వయస్సు కూడా పైబడింది. మరి అతడితో యంగ్ అండ్ డైనమిక్ యానా డీ అర్మాస్ ఊరికే ఉంటుందా? కథ నడుస్తుండగా పదే పదే సెటైర్లు వేస్తూ ఉడికిస్తుందట! అయితే, ఇవేవీ శ్రుతి మించవని బాండ్ ఫ్యాన్స్ కి రైటర్స్, డైరెక్టర్ హామీ ఇస్తున్నారు. పంచులన్నీ సరదాగా మాత్రమేనట! యాక్షన్ వద్దకొచ్చే సరికి … ‘బాండ్.. బాండే’నంటూ తేల్చి చెబుతున్నారు! చూడాలి మరి, సెప్టెంబర్ 8న డేనియల్ క్రెయిగ్ లాస్ట్ ‘007 మిషన్’ ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-