పవన్ అభిమానులకు దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నిన్నటి నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో నుంచి సరికొత్త అప్డేట్స్ ప్రకటించడానికి మేకర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు.

Read Also : పవన్ బర్త్ డే ట్రీట్స్… ఈ టైమింగ్స్ లోనే..!

ఈ నేపథ్యంలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మెగా అభిమానులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో గతంలో ‘జల్సా’ సినిమా వచ్చిన విషయం. ఆ మూవీ మ్యూజిక్ అప్పట్లో ఒక సంచలనం. తాజాగా మళ్లీ దేవిశ్రీ ప్రసాద్ ఆ రోజులను గుర్తు తీసుకొచ్చాడు. పవన్ బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ అప్పట్లోనే ఈ వీడియోను సినిమా ప్రమోషన్స్ కోసం తయారు చేశామని, కానీ పలు కారణాల వల్ల ఈ వీడియో రిలీజ్ చేయలేకపోయామని చెప్పుకొచ్చాడు. కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నిర్మాత అల్లు అరవింద్ చొరవతో ఈ వీడియోను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం అంటూ టైటిల్ ట్రాక్ ప్రమోషనల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశాడు.

Related Articles

Latest Articles

-Advertisement-