ప్రకృతి అంటే ఆమెకు ప్రాణం.. ఆ ప్రకృతి ప్రకోపానికే బలి..

ప్రకృతి అంటే ఆమెకు ఎంతో ఇష్టం.. అందుకే తరచూ వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ.. ఆ జర్నీలోని అనుభవాలను, అనుభూతులను ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ ఉంటుంది.. కానీ, తాను ట్వీట్‌ చేసిన అరగంటలోపే ఆ ప్రకృతి ప్రకోపానికే బలిఅవుతానని ఊహించి ఉండదు.. ఇప్పుడా ఘటన సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ దీప శర్మ.. ఈ సృష్టిలోని ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేస్తూ వచ్చారు.. ఆయుర్వేద వైద్యురాలిగా మంచి పేరు సంపాదించుకున్న ఆమెకు ప్రకృతి అంటే.. ఎంతో ప్రేమ.. ఇప్పటికే ఎన్నో ప్రదేశాలను చుట్టేశారు.. తాజాగా.. హిమాచల్‌ ప్రదేశ్‌ పర్యటనకు వెళ్లి.. తిరిగి వస్తుండగా.. హిమాచల్‌ప్రదశ్‌లోని కిన్నౌర్ జిల్లా సంగ్లా-చిత్ కుల్ రోడ్డు వద్ద ఆదివారం కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృత్యువాతపడ్డారు.. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 34 ఏళ్ల ఆయుర్వేదిక్‌ డాక్టర్ దీపా శర్మ.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్న ఫొటోలు.. రాసిన టెస్ట్‌ అందరినీ కట్టిపపడేస్తోంది.

కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన జరగడానికి సరిగ్గా 25 నిమిషాల ముందు ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అయిపోయింది.. సాధారణ ప్రజలకు అనుమతి ఉన్న భారతదేశపు చిట్టచివరి పాయింట్ వద్ద నేనిప్పుడు నిల్చొని ఉన్నా.. ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో చైనా అక్రమించిన టిబెట్‌తో మనకు సరిహద్దు ఉంది.. అంటూ ట్వీట్ చేశారు దీపా శర్మ.. కానీ, అదే ఆమె చివరి ట్వీట్ అయిపోయింది.. మధ్యాహ్నం 12.59 గంటల ప్రాంతంలో అక్కడి కొండల్లో ఉన్న ఇండియా-టిబెట్‌ బార్డర్‌ దగ్గర దిగిన ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.. 1.25 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగి బస్తేరీ వద్ద సంగ్లా-చిట్కుల్‌ రోడ్డు మీద వెళుతున్న కార్లపై పడగా.. ఓ కారులో ఉన్న దీప అక్కడిక్కడే మృతి చెందింది. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన అరగంటకే దీప కూడా మృతిచెందింది. ఇక, అంతకుముందు రోజు కొండ ప్రాంతంలో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు.. అంటూ కామెంట్‌ పెట్టారు దీపా శర్మ.. తనకు ప్రకృతిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చాటుకున్నారు.. కానీ, ఆ ప్రకృతిలో సంభవించిన ఊహించని ఘటనలో ప్రాణాలు వదలడం విషాదంగా మారిపోయింది. దీంతో.. దీప పెట్టిన ట్విట్టర్‌ పోస్టులు ఇప్పుడు వైరల్‌ అయిపోయాయి..

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-