‘జై భీమ్’ చిత్రంపై రియల్ సినతల్లి సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు సినిమా చూసి ఏం చేయాలి

స్టార్ హీరో సూర్య పేరు ప్రతిచోటా మారుమ్రోగిపోతుంది. ‘జై భీమ్’ చిత్రంతో దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్నాడు. ‘జైభీమ్’ సినిమా కథ నిజజీవితంలో పార్వతి అనే మహిళది అని అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత పార్వతి నిజ జీవితం గురించి పలు ఛానెళ్లు ఇంటర్వ్యూలు చేశాయి. సూర్య సైతం ఆమెకు ఆర్థిక సాయం చేశారు. ఇక తాజాగా పార్వతి ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జై భీమ్ సినిమా చూడలేదని, తన మనవళ్లు ఫోన్ లో సినిమా చూపించారు కానీ చివరి వరకు చూడలేదని చెప్పింది.

“అన్నీ కోల్పోయాను, నిరాశలో ఉన్నాను. ప్రాణమే పోయింది ఇంకా ఇప్పుడు సినిమాను చూసి ఏం చేయగలను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక సూర్యతో ఏమి మాట్లాడారు అని అడగగా.. ఆయనతో సరిగ్గా మాట్లాడలేదని, చెక్ ఇచ్చి, డబ్బు మీద వచ్చే వడ్డీతో సంతోషంగా ఉండాలని సూర్య కోరినట్లు చెప్పింది. ఇక తన గతాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పిన పార్వతి ఎన్నో కష్టాలను అనుభవించినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కూతురు, అల్లుడితో కలిసి ఉంటున్నానని తెలిపింది.

Related Articles

Latest Articles