ప్రగతి భవన్ ముందు దీక్ష.. జగ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌ పై విరుచుకుపడ్డారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర సోనియాగాంధీది. వైద్యం కోసం ఆరోగ్య శ్రీ తెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్. రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అంటే మమ్మల్ని నమ్మలేదు జనం. ఒకసారి లక్ష మాఫీ చేస్తాం అని చెప్పిన కేసీఆర్‌ని నమ్మి ఓటేశారు. రైతులు నమ్మి ఓటేస్తే రుణమాఫీ ఇప్పటికీ జరగలేదన్నారు జగ్గారెడ్డి.

కానీ లక్ష కు లక్ష వడ్డీ అయ్యింది. కేసీఆర్‌ని నమ్మి రైతులు నమ్మి ఓటేస్తే రుణమాఫీ పూర్తికాలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ సర్కార్ లోనే ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ఉద్యోగాలు తక్కువన్నారు జగ్గారెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన డిమాండ్ లే.. ఇప్పుడు వినాల్సి వస్తుంది. ఎనిమిది నెలల్లో మళ్లీ ఎన్నికలు వస్తాయి.. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైందన్నారు.సోమవారం ప్రగతి భవన్ ముందు దీక్షకు దిగుతానన్నారు. ఇచ్చిన హామీలు అమలు కోరుతూ దీక్ష చేస్తానని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే దీక్ష చేస్తానన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే గా దీక్ష చేస్తున్నానని, దీన్ని రాజకీయంగా చూడకండని కోరారు. ఐదు అంశాలపై నా నియోజక వర్గ ప్రజల కోసం దీక్ష చేస్తున్నా అని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.

Related Articles

Latest Articles