మేము కొట్లడుడు బంద్.. ఇక ప్రభుత్వం మీదే కొట్లాట

టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నాడు అంటే, సోనియా.. రాహుల్ గాంధీలు ఉన్నట్టేనని తెలిపారు. సోనియాగాంధీ ఆదేశాల మేరకు కలిసి పని చేస్తామన్నారు. వ్యక్తిగత అభిప్రాయం ఏది ఉన్నా.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. పదవి కోసం పోటీ పడటం సహజమని.. నిర్ణయం అయిపోయింది కాబట్టి, పార్టీని అధికారంలోకి వచ్చేలా అందరం కలిసి కృషిచేస్తామన్నారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నానన్నారు. మేము కొట్లడుడు బంద్ చేసి.. ఇక ప్రభుత్వం మీద కొట్లాడుతామన్నారు. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తానని, వీలైతే పాదయాత్ర చేయాలని ఆలోచన ఉందని తెలిపారు. పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానన్నారు జగ్గారెడ్డి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-