ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌.. 3.7 ల‌క్షల మందికి ల‌బ్ధి

క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌భుత్వ ఆదాయం ప‌డిపోయినా.. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూనే ఉంది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స‌ర్కార్.. మంగ‌ళ‌వారం రోజు జగనన్న తోడు పథకం కింద నగదు జమ చేయనున్నారు.. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు బదిలీని ప్రారంభించ‌నున్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఈ ప‌థ‌కం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందించ‌నున్నారు.. వరసగా రెండో ఏడాది కూడా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది ఏపీ ప్ర‌భుత్వం.. ఈ ప‌థ‌కంలో రాష్ట్రంలో3.7 లక్షల మంది చిరు వ్యాపారులకు ల‌బ్ధి చేకూర‌నుంది.. ఈ పథకం కోసం రూ.370 కోట్లు వెచ్చిస్తోంది స‌ర్కార్.. క‌రోనా స‌మ‌యంలో.. క‌ర్ఫ్యూల‌తో చిరు వ్యాపారులు తీవ్రంగా దెబ్బ‌తిన్న స‌మ‌యంలో.. వారికి ఈ ప‌థ‌కం ఎంతో దోహ‌ద‌ప‌డ‌నుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-