ఏపీలో ప్రతి జిల్లాలో జగనన్న స్మార్ట్ టౌన్

ఏపీలోని నగరాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ రేటుకే భూములు అందించే ఉద్దేశంతో జగనన్న స్మార్ట్ టౌన్ (ఎంఐజీ -మిడిల్ ఇంకమ్ గ్రూప్ లేఅవుట్లు) ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతి జిల్లాలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఐదు జిల్లాల్లో భూములను సమీకరించి అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

Read Also: చంద్రబాబు కుప్పం బాట పట్టడం మా నైతిక విజయం : మంత్రి పెద్దిరెడ్డి

ఈ మేరకు ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తొలి దశలో ఎంఐజీ లే అవుట్లు అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి జిల్లాలో ఒక ఎంఐజీ లేఅవుట్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగిలిన జిల్లాలలో కూడా ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూముల సేకరణకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రైవేట్ భూములను ప్రభుత్వ ధర కంటే 5 రెట్ల విలువకు మించకుండా సేకరించనున్నారు. అసైన్డ్ భూములను రైతులు, ప్రజల నుంచి భూసమీకరణ పథకం కింద తీసుకోనున్నారు. ఈనెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఎంఐజీ లేఅవుట్లను అధికారులు ప్రారంభించాలని కసరత్తు చేపట్టారు.

Related Articles

Latest Articles