కేంద్ర బృందంతో ముగిసిన జగన్ సమావేశం

ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎంతో సమావేశం నిర్వహించింది. అనంతరం కేంద్రం బృందం సభ్యుడు కునాల్ సత్యార్థి మాట్లాడుతూ.. కేంద్ర బృందం తరుపున వివరాలను సీఎం జగన్‌కు సమర్పించినట్లు తెలిపారు.

అంతేకాకుండా వరద ప్రభావం వల్ల కడప జిల్లాలో భారీ నష్టం జరిగిందన్నారు. పంటలు, పశువులు కొట్టుకుపోయాయని, అన్నమయ్య ప్రాజెక్ట్‌ తెగిన చోట అపార నష్టం జరిగిందని ఆయన తెలిపారు. 32 శాతం నష్టం సాగ, అనుబంధ రంగాల్లో చోటు చేసుకుందన్నారు. వీలైనంతమేర ఆదుకునేందుకు కేంద్రం సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు.

Related Articles

Latest Articles