జగన్ కీలక నిర్ణయం.. అసలేం జరిగింది?

ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న మూడురాజధానుల అంశం కీలక మలుపు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని న్యాయస్ధానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు బిల్లు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది.

నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని ఇంతకుముందే సమాచారం వచ్చింది. అత్యవసర క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని విస్తృత ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఉన్న బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకునే ఆలోచనలో వుంది. కొన్ని మార్పులతో కొత్తగా మళ్లీ సభలో మూడు రాజధానుల బిల్లు పెట్టే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం.

జగన్ తీసుకున్న నిర్ణయం వెనుక అసలేం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. మూడురాజధానుల నిర్ణయం వెనుక దీనివెనుక అనేక రాజకీయ కోణాలు వున్నాయి. విశాఖ, కర్నూలు విషయంలో ఏం జరగబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల్ని ఊరిస్తూ వచ్చారు. విశాఖ పాలనా రాజధాని అయితే ఆ ప్రాంతం దశ తిరుగుతుందని ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక ఏం జరిగిందనేది జగన్ సభలో ప్రకటిస్తారని అంటున్నారు.

న్యాయ, చట్టపరమయిన అంశాలున్నాయి. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని విపక్షం కోర్టుకి తెలిపింది. కేంద్రం నుంచి సానుకూలత లేదని భావించాలంటున్నారు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలవారు జగన్ ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఏం తీసుకున్నా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఏ ప్రభుత్వం కూడా లాభనష్టాలను బేరీజు వేసుకుంటుంది. ప్రభుత్వం కీలకమయిన వివరణ ఇస్తుందని భావిస్తున్నారు. మిగతా ప్రాంతాలవారికి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందనేది తేలాల్చి వుంది. మంత్రులు ఈ విషయంలో స్పందించడానికి నిరాకరిస్తున్నారు.

Related Articles

Latest Articles