రైతులకు శుభవార్త చెప్పిన జగన్‌ సర్కార్..

జగన్‌ సర్కార్‌ రైతులకు శుభవార్త చెప్పింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తొలివిడత 4,314 డిజిటల్‌ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్‌ లైబ్రరీలకు అవసరమయ్యె ఇంటర్‌నెట్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని, అప్పుడే వర్క్‌ హోం కాన్సెప్ట్ విజయవంతం అవుతుందన్నారు.

దీంతో పాటు రైతు భరోసా రెండో విడత కార్యక్రమాన్ని ఈ నెల 26 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాల నిర్మాణాన్ని సంబంధిత కలెక్టర్‌ పర్యవేక్షించాలని, రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరించాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను మాత్రమే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులపై ఉక్కుపాదం మోపాలని సూచించారు.

Related Articles

Latest Articles