ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు : చంద్రబాబుకు జగన్ కౌంటర్

చంద్రబాబు విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు అని చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. గతంలో కంటే… ఇప్పుడు వరద బాధితులకు తొందరగా సహాయాన్ని అందించగలిగారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించామని… గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేదని చంద్రబాబుకు చురకలు అంటించారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేదని… గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదని ఫైర్‌ అయ్యారు సీఎం జగన్‌.

అలాంటిది ఇవాళ వారం రోజుల్లో ఆయా కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని అదుకున్నామని.. గతంలో రేషన్, నిత్యావసరాలు ఇస్తే చాలు అనుకునేవాళ్లని తెలిపారు. మనం వీటిని ఇవ్వడమే కాకుండా రూ.2వేల రూపాయలు అదనపు సహాయం కూడా ఇచ్చామని.. ఇప్పుడు నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ పూర్తి చేసి సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు సీఎం జగన్‌. గతంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేదని.. ఆ తర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇవాళ పంట నష్టపోయిన సీజన్‌ ముగిసేలోగానే మనం అందిస్తున్నామని గుర్తు చేశారు సీఎం జగన్.

Related Articles

Latest Articles