పోచారం మనవరాలి వివాహానికి హాజరైన జగన్, కేసీఆర్

చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు… ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. ఏపీ – తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం అనంతరం.. సీఎం కేసీఆర్, సీఎం జగన్‌… తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మనవరాలి వివాహానికి హాజరయ్యారు. హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ లో తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మనవరాళి వివాహాం జరిగింది.

అయితే…. ఈ శుభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, సీఎం జగన్‌…ఇద్దరూ ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. అంతేకాదు… ఈ వివాహ వేడుకలో… పక్క పక్కనే కూర్చుని.. మాట్లాడుకున్నారు సీఎం కేసీఆర్, సీఎం జగన్‌. అనంతరం.. ఇద్దరూ సీఎంలు.. నూతన వధూవరులను ఆశీర్వదించి వారితో ఫోటోలు కూడా దిగారు. ప్రస్తుతం ఈ వివాహ వేడుక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది. కాగా.. ఈ శుభకార్యంలో… టీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు.. ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా హాజరయ్యారు.

Related Articles

Latest Articles