జాక్విలిన్ ఫెర్నాండెజ్… ఆ 40 మందిలో ‘ఒకే ఒక్క’ ఇండియన్!

’40 అండర్ 40’… టైమ్స్ సంస్థ ప్రతీ యేటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక పట్టిక ఇది! ఈ లిస్టులో చోటు దక్కటం అరుదైన విషయమే. అయితే, ఈ సారి టైమ్స్ వారు ఎంపిక చేసిన 40 మంది యంగ్ అండ్ బ్రైట్ ఎంటర్ ప్రీనియర్స్ లో మన దేశం నుంచీ ఒకే ఒక్కరికి చోటు దక్కింది! తనే… జాక్విలిన్ ఫెర్నాండెజ్!

నటిగా మనందరికీ తెలిసిన జాక్విలిన్ ఈ మధ్యే ఒక ఇన్షియేటివ్ తీసుకుంది. ‘షీరాక్స్’ అనే వేదిక ప్రారంభించింది. తన సంస్థ ద్వారా ఆమె మహిళల్లోని ప్రతిభని వెలికి తీయాలని ప్రయత్నిస్తోంది. జాక్విలిన్ స్థాపించిన ‘షీరాక్స్’ వివిధ వర్గాల్లోని స్త్రీలకు తమ టాలెంట్ బయట పెట్టుకునే ఛాన్స్ కల్పిస్తుంది. అలాగే, కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో ఆరోగ్యం గురించిన విషయాల్లోనూ అవగాహన, చైతన్యం కల్పిస్తుంది. ఇటువంటి సామాజిక సంక్షేమంతో కూడుకున్న ప్రయత్నానికి జాక్విలిన్ పూనుకోవటమే ఆమెకు ’40 అండర్ 40’ లిస్టులో స్థానం కల్పించింది.

పుట్టుకతో ఇండియన్ కానప్పటికీ ఇక్కడే సెటిలైన జాక్విలిన్ తిరిగి సమాజినికి ఎంతో కొంత మంచి చేయాలనుకోవటం మెచ్చుకోవాల్సిన విషయమే! చూడాలి మరి, ఈ యంగ్ అండ్ బ్యూటిఫుల్ ఎంటర్ ప్రీనియర్ రానున్న కాలంలో ఇంకా ఏమేం చేస్తుందో! మహిళలకు తన ‘షీరాక్స్’ సంస్థ ద్వారా ఏ విధంగా తోడ్పడుతుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-