బెంగుళూరులో బాలీవుడ్ బ్యూటీ! శాండల్ వుడ్ ఎంట్రీకి శ్రీలంక సుందరి రెడీ!

‘సాహో’తో తెలుగు వారికి పరిచయమైన బబ్లీ ‘బ్యాడ్ గాళ్’ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు కన్నడలో కాలుమోపింది. రీసెంట్ గా ఆమె బెంగుళూరులో ఓ పాటకి స్టెప్పులేసింది. అయితే, ఈసారి ‘సాహో’లో మాదిరిగా స్పెషల్ సాంగ్ కే పరిమితం కాలేదు బాలీవుడ్ బ్యూటీ. తొలిసారి సౌత్ మూవీలో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసింది. కిచ్చా సుధీప్ హీరోగా తెరకెక్కుతోన్న ‘విక్రాంత్ రోనా’ సినిమాలో ఆమె కీలక పాత్రలో అలరించబోతోంది…

అక్షయ్ కుమార్ లాంటి హీరో సహా పలువురు బీ-టౌన్ బిగ్ స్టార్స్ తో సినిమాలు చేస్తోంది జాక్విలిన్. అయితే, బాలీవుడ్ బిజీ షెడ్యూల్ మధ్యలోనే బెంగుళూరుకి వచ్చి శ్రీలంక భామ ఆడిపాడింది. సుధీప్ లాంటి స్టార్ మూవీ కావటంతో శాండల్ వుడ్ ఎంట్రీకి ఓకే చెప్పింది జాకీ. పైగా ‘విక్రాంత్ రోనా’ సినిమాలో ఆమె రోల్ చాలా కీలకమేనట. తన ఎంట్రీతో కథలో అనేక మార్పులు వస్తాయట. కాబట్టి అటువంటి స్పెషల్ క్యారెక్టర్ లో కనువిందు చేయటం హ్యాపీగా ఉందంటోంది గార్జియస్ గాడెస్. సుధీప్, నీతా అశోక్ ప్రధాన పాత్రల్లో మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్ గా తెరుకెక్కుతోంది ‘విక్రాంత్ రోనా’…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-