ఆఖరి టెస్టు : మొదటిసారి ఇంగ్లాండ్ జట్టులోకి స్పిన్నర్..?

భారత్-ఇంగ్లాండ్ మధ్య ఉత్కంఠభరమైన టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టులో రెండు కోహ్లీసేన విజయం సాధించగా ఒకటి ఆతిథ్య జట్టు కైవసం చేసుకుంది. మరొకటి డ్రాగా ముగిసింది. అయితే ఈ నాలుగు టెస్టులో కూడా ఇంగ్లాండ్ జట్టు ఒక్క పూర్తి స్పిన్నర్ ను జట్టులోకి తీసుకోలేదు. కేవలం ఆల్ రౌండర్ మొయిన్ అలీ మాత్రమే ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ ఈ నెల 10 న ప్రారంభం కానున్న ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు మొదటిసారిగా ఓ పూర్తి స్పిన్నర్ ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా చివరి టెస్ట్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ బోర్డు జోస్ బట్లర్, జాక్ లీచ్ ను జట్టులోకి తీసుకుంది. చివరి టెస్టుకు ముందు జట్టులోకి తీసుకోవడంతో స్పిన్నర్ జాక్ లీచ్ తుది జట్టులో ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. అయితే లీచ్ రాకతో స్పిన్ ఆల్ రౌండర్ గా ఉన్న మొయిన్ అలీని తప్పించి పేసర్ సామ్ కర్రన్ ను ఆడించనున్నట్లు తెలుస్తుంది. అలాగే భారత జట్టులోకి కూడా అశ్విన్ రానున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ ఇంగ్లాండ్ స్పిన్నర్ టీం ఇండియా పై ఏ మాత్రం ప్రభావం చూపిస్తాడు అనేది.

Related Articles

Latest Articles

-Advertisement-