ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జబర్దస్త్ బ్యూటీ!

బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మీ తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆ పరిచయంతోనే ఆమెకు మరో అవకాశం లభించిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రష్మీ నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, కీలక పాత్రలో రష్మీ కనిపించనుందని తెలుస్తోంది. సినిమాను శ్రీవేంకటేశ్వర ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ కూడా మొదలు కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-