పుకార్లకు చెక్… ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్

బుల్లితెరపై కామెడీ షోతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చాడు. జబర్దస్త్ కామెడీ షో నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ముక్కు అవినాష్ చాలా రోజులు ఆ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను నవ్వించాడు. అనంతరం జబర్దస్త్ ను వదిలి “బిగ్ బాస్” హౌస్ లోకి అడుగు పెట్టాడు. అక్కడ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా మరో లేడీ కంటెస్టెంట్, యాంకర్ అరియానాతో స్నేహం, లవ్ అంటూ వార్తల్లో నిలిచాడు. అప్పటి నుంచి అవినాష్, అరియనా మధ్య ఏదో ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ నుంచి వాళ్లిద్దరూ బయటకు వచ్చాక ఎదురైన మొదటి ప్రశ్న అదే. అయితే ఆ ఇద్దరూ తమ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కానీ నెటిజన్లు వదిలితేగా… స్నేహం మాత్రమే ఉంటే అంత క్లోజ్ గా ఎందుకు ఉంటారు ? అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. ఆ రూమర్లతోనే మరింత క్రేజ్ ను సంపాదించుకునే పనిలో పడ్డారు అరియనా, అవినాష్.

Read Also : డ్రగ్స్ కేసు: పూరీ విచారణ పూర్తి.. మరోసారి పిలిచే అవకాశం?

తాజాగా ఆమెతో లవ్ రూమర్లకు చెక్ పెడుతూ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు అవినాష్. ఇటీవల అవినాష్… అనూజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అవినాష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. “బిగ్ బాస్ తెలుగు 4 రియాలిటీ షో”తో మరింత ఎదిగిన ముక్కు అవినాష్ చాలా మంది అభిమానులను సంపాదించుకుని సక్సెస్ అయ్యాడు. ఇంతకుముందు అనేక సార్లు ఈ హాస్య నటుడిని అతని వివాహం గురించి అడిగారు. అప్పుడు అవినాష్ తన వివాహం గురించి వ్యంగ్యంగా సమాధానాలు ఇచ్చేవాడు. కొన్నిసార్లు మాత్రం ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెప్పేవాడు. ఏదైతేనేం చివరకు అవినాష్ పెళ్లికి సిద్ధమయ్యాడు. అతను అనుజాతో తన నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)

Related Articles

Latest Articles

-Advertisement-