కెప్టెన్సీ కోల్పోవడం పై అయ్యర్ స్పందన…

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ లో ప్రారంభమైన అప్పుడు కరోనా కారణంగా దానిని వాయిదా వేశారు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం బారినపడి దూరం కావడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది ఢిల్లీ యాజమాన్యం. అయితే ఇప్పుడు వాయిదా పడిన సీజన్ మళ్ళీ యూఏఈ వేదికగా ప్రారంభం అయ్యింది. అలాగే గాయం ఉంది కూడా అయ్యర్ పూర్తిగా కోలుకోవడంతో తిరిగి అతనికే కెప్టెన్సీ ఇస్తారు అనుకున్నారు. కానీ మిగిలిన మ్యాచ్ లకు కూడా పంత్ కెప్టెన్ గా ఉండదు అని ఢిల్లీ యాజమాన్యం ప్రకటించింది. ఇక నిన్న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. అనంతరం అయ్యర్ మాట్లాడుతూ కెప్టెన్సీ పైన స్పందించాడు. నేను యాజమాన్యం నిర్ణయాన్ని గౌరవిస్తాను. అలాగే పంత్ కూడా చాలా అద్భుతంగా కెప్టెన్సీ భాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి కెప్టెన్ గా పంత్ ను కొనసాగించడం మంచి నిర్ణయమే అని అయ్యర్ ప్రకటించాడు.

-Advertisement-కెప్టెన్సీ కోల్పోవడం పై అయ్యర్ స్పందన...

Related Articles

Latest Articles