బీజేపీ కేసులకు భయపడదు: ఈటల రాజేందర్‌

ఈ రాష్ట్రంలో కేసీఆర్‌ రాజ్యాంగం అమలువుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బండి సంజయ్‌ జాగరణ దీక్షను అడ్డుకోవడం పై ఆయన సోమవారం మాట్లాడుతూ ..కేసీఆర్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ కేసులకు భయపడబోదన్నారు. కేసీఆర్‌ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. ప్రగతి భవన్‌కు ఇనుపకంచెలు, ఫాంహౌస్‌కి గోడలు కట్టుకుని ఉంటున్నాడని ఆయన ధ్వజమెత్తారు. సీఎం ఒక చక్రవర్తిలా ఎవరి మాట వినను అంటున్నాడని ఆరోపించారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయని సంజయ్ తన సొంత కార్యాలయంలో జాగరణ కార్యక్రమం తలపెట్టారన్నారు. శత్రు సైన్యాల మధ్య జరిగే ఘర్షణలా కరీంనగర్‌ కమిషనర్‌ వ్యవహరించారని మండిపడ్డారు.

Read Also:వైఎస్‌ షర్మిల పార్టీలో చేరిన గట్టు రామచంద్రరావు..

సంజయ్‌ని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బెంగాల్ కాదు…ఇది తెలంగాణ గడ్డ. ఎన్నో త్యాగాలు ఇక్కడ చేసిన పార్టీ బీజేపీ అన్నారు. హుజురాబాద్‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌ ఆగం ఆగం అవుతున్నారు. కాళ్ల కింద భూమి కదులుతుందని భయపడుతున్నారు. నిర్భంధంతో ఏమి సాధించలేవు. ఇంత జరుగుతున్న ఉద్యోగ సంఘాలు పట్టించుకోక పోవడం సమంజసం కాదన్నారు. నీరో చక్రవర్తిలా వ్యహరిస్తున్న కేకసీఆర్‌ను కలవడండి అంటూ ఈటల ఉద్యగ సంఘాలకు పిలుపునిచ్చారు.

Related Articles

Latest Articles