ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే ఏకైక రాష్ట్రం తెలంగాణే..?ఈటల రాజేందర్‌

దేశ చరిత్రలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ఈటల రాజేందర్‌ అన్నారు. దీనికి కారణం సీఎం కేసీఆరే అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మహబూబ్ నగర్‌ బీజేపీ నిరసన సభలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. ఉద్యోగ వర్గానికి సంఘీభావం కోసం బీజేపీ నేతలను రాష్ట్రానికి వస్తున్నారన్నారు. ప్రభుత్వం విమర్శించే కన్నా ముందుగా మీరు చేయాల్సింది స్థానికత ఆధారంగా ఉద్యోగులను సవరించాలని డిమాండ్ చేశారు. 317 జీవోను రద్దు చేయలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కుంభకర్ణుడిలా నిద్ర పోతూ ఉద్యోగులను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: ఇన్నోవా కారులో అనుమానస్పదంగా వ్యక్తి మృతి..

నాడు సకల జనుల సమ్మెలో పాల్గొన్నవారు ఉద్యోగులు, టీచర్లు కాదా.. ముఖ్యమంత్రి గారూ మరిచిపోయారా అంటూ.. ప్రశ్నించారు. బీజేపీ నాయకులు వద్దకు తమ సమస్యలు చెబితే ట్రాన్సఫర్లు చేస్తున్నారు. దరఖాస్తు ఇస్తే సస్పెండ్‌ చేస్తున్నారు. ఉద్యోగులు కర్రు కాల్చి వాత పెడుతారని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాన్ని పాతాళంలో పాతరేస్తారంటూ ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీ నిరసన తెలిపితే.. కార్యకర్తలను గొడ్లను కొట్టినట్లు కొడుతున్నారని.. ఎంపీ బండి సంజయ్ నిరసన తెలిపితే… సీపీ ఎం చేశారో అందరూ చూశారని ఆయన అన్నారు. మీది బుడ్డ పార్టీ అని టీఆర్ఎస్‌ను విమర్శించారు. మాది 303 సీట్లు గెలిచి దేశంలో అధికారంలో ఉన్నామని, 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని టీఆర్ఎస్ పార్టీనేతలకు ఈటల రాజేందర్‌ గుర్తు చేశారు.

Related Articles

Latest Articles