ట్విట్టర్ సాగతీత ధోరణికి హైకోర్టు మొట్టికాయలు!

భారత నూతన ఐటీ చట్టాలను పాటించడంలో ట్విట్టర్ మనస్ఫూర్తిగా అడుగులు వెయ్యలేకపోతుంది. ఇప్పటికే పలుమార్లు ట్విటర్ ప్రతినిధులు, కేంద్రంతో చర్చలు జరిపిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇక కేంద్రం ఏమాత్రం ట్విటర్ వాదనలు వినదల్చుకోలేదు. తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ట్విట్టర్ కు మొట్టికాయలు వేసింది. భారత నూతన ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్‌కు రక్షణ కల్పించలేమని ఈరోజు విచారణలో తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. ఈ సాగతీత ధోరణికి స్వస్తి చెప్పాలనే రీతిలో సమాధానం ఇచ్చింది. కాగా, దీనిపై తుది విచారణకు జులై 28వ తేదీకి వాయిదా వేసింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-