హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో కీలక పరిణామం

హెటిరో డ్రగ్స్ సంస్థల్లో జరుగుతున్న ఐటి దాడులులో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. రెండు రోజులుగా ఐటి అధికారులు చేస్తున్న దాడి లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి . టాక్స్ చెల్లింపులో వ్యత్యాసంతో పాటుగా పెద్ద ఎత్తున తప్పుడు ఇన్వాయిస్ లు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో పాటుగా పెద్ద మొత్తంలో కంపెనీ అకౌంట్స్ నుంచి నగదు విత్ డ్రా చేసినట్టుగా అధికారులు గుర్తించారు. కంపెనీ నుంచి విత్ డ్రా చేసిన నగదు ఎక్కడికి వెళ్తుందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు . రెండు రోజులు గా కొనసాగుతున్న సోదాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారనీ సమాచారం.. అయితే హెటిరో డ్రగ్స్ వ్యవహారంలో అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడే దీనిపైన అధికారులు ఎందుకు దాడులు చేస్తున్నారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ దాడిలో అధికారులు ఏం చేశారు. మరో రెండు రోజుల పాటు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

కరోనా సమయంలో ఈ సంస్థ తయారు చేసిన డ్రగ్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. బ్లాక్ మార్కెట్లో కూడా డ్రగ్స్ అమ్మడం జరిగింది. కరోనా సమయంలో పెద్ద మొత్తంలో కంపెనీ లాభాలు ఆర్జించి నట్టుగా అధికారుల విచారణలో బయట పడింది. మందు ను దిగుమతి ఎగుమతుల్లో చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో విదేశాల నుంచి ముడి సరుకు దిగుమతి చేసుకున్నట్లు లెక్కలు చూపెట్టారు. దానికి సంబంధించి మెడిసిన్ తయారు చేసి ఎగుమతి చేసినట్టుగా పేర్కొన్నారు. మెడిసిన్ ఎగుమతికి సంబంధించి చాలా తక్కువ బిల్లు లు జనరేట్ చేశారు. ఇక్కడే పెద్ద మొత్తంలో టాక్స్ చెల్లింపులు గోల్మాల్ జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా తయారు చేసిన మెడిసిన్ కంటే దిగుమతి చేసిన చేసిన మెడిసిన్ చాలా తక్కువ చూపెట్టారు. ముడి సరుకు వ్యవహారంలో మొత్తం గోల్మాల్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే మెడిసిన్ తయారుచేస్తున్నారో ఆయా యూనిట్లకు ఐటి అధికారులు వెళ్లి తనిఖీ చేస్తున్నారు . ఉత్పత్తి, ఎగుమతులు తీరుతెన్నులు, అనే దానిపై విచారణ జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్న తయారీ ఈనాటి తో పాటు ఆంధ్ర లో ఉన్న తయారీ యూనిట్లను కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు దీంతోపాటుగా సనత్ నగర్ లో ఉన్న కార్పొరేట్ ఆఫీసులో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు మరోవైపు హైదరాబాద్ విశాఖపట్నం గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేస్తున్నారు.

కోవిడ్ 19 సమయంలో కంపెనీ జరిపిన లావాదేవీలు,ఐటీ రిటర్న్స్ పత్రాలను పరిశీలించి న అధికారులు గుర్తించారు. హెటిరో డైరెక్టర్ల ఇళ్లలో ను కొనసాగిన దాడులు చేస్తున్నారు. జొన్నల సంబి రెడ్డి, నరసింహారెడ్డి, బండి వంశీకృష్ణ, బండి పార్థసారథి రెడ్డి తో పాటు వారి పాట్నర్ ఇళ్లలో ను సోదాలు నిర్వహించచిన ఐటి శాఖ అధికారులు. హైదరాబాద్ సనత్ నగర్ హేటిరో హెడ్ ఆఫీస్ తో పాటు వైజాగ్ నక్కపల్లి మండలం లో ఉన్న హెటిరో కార్యాలయం పై నా ఐటి దాడులు నిర్వహించారు. మరొక వైపు కార్పొరేట్ కార్యాలయంలో పెద్ద మొత్తంలో నగదును కూడా అధికారులు గుర్తించారు. ఒక కార్పొరేట్ కార్యాలయంలో ఎంత పెద్ద మొత్తంలో నగదు ఎందుకు ఉంచుతున్నారని దానిపైన ప్రశ్నిస్తున్నారు.

ఈ నగదుకు సంబంధించి వివరాలు తెలపాలంటూ ఐటీ అధికారులు కంపెనీ అధికారులకు నోటీసు ఇచ్చారు. ఈ ఐటీ సోదాలు శనివారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులకు సమాచారం. ఎందుకంటే పెద్ద మొత్తంలో టాక్స్ చెల్లింపులు అక్రమాలు గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మరో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుని నేపథ్యంలో దానికి కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కంపెనీ సంబంధించిన చైర్మన్ సీఈవో ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించిన వివరాలు అన్నీ పూర్తయ్యే సరికి రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.

– Ramesh Vaitla

-Advertisement-హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో కీలక పరిణామం

Related Articles

Latest Articles