ఖిలాడీ : “ఇష్టం” లిరికల్ వీడియో సాంగ్

ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ నటిస్తున్న తాజా చిత్రం “ఖిలాడీ” నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ప్రేక్షకులను గత కొన్ని రోజుల నుంచి ఊరిస్తున్న “ఇష్టం” సాంగ్ ను ఈరోజు వినాయక చవితి కానుకగా రిలీజ్ చేశారు మేకర్స్. హీరో హీరోయిన్ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ను హరిప్రియ పాడగా, శ్రీమణి లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. లవర్స్ ను, యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Read Also : ‘మణికే మాగే హితే’ సాంగ్ కు బాలీవుడ్ ఫిదా

మాస్ మహారాజ రవితేజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై నిర్మించారు. రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 2021 మే 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే “ఖిలాడీ” వాయిదా పడింది.

Related Articles

Latest Articles

-Advertisement-