అంత‌రిక్షంలో చంద్రయాన్ 2, నాసా ఆర్బిట‌ర్‌కు తృటిలో త‌ప్ప‌ని ప్ర‌మాదం…

అంత‌రిక్షం గురించి ఎన్ని విష‌యాలు తెలుసుకున్నా కొత్త‌గానే కనిపిస్తుంది.  తెలియ‌ని ర‌హ‌స్యాలు శాస్త్ర‌వేత్త‌ల‌కు స‌వాల్ విసురుతూనే ఉంటాయి.  అంత‌రిక్ష ర‌హ‌స్యాల‌ను చేధించేందుకు వివిధ దేశాలు ఉప‌గ్రమాల‌ను ప్ర‌యోగిస్తుంటాయి.  ఇప్ప‌టికే వేలాది ఉప‌గ్ర‌హాలు అంత‌రిక్షంలో ప‌రిభ్ర‌మిస్తున్నాయి.  భూమిపై అంటే ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు.  విమాన‌యాన రంగంలో ఏటీఎఫ్ వ్య‌వ‌స్థ ఉంటుంది.  అదే అంత‌రిక్షంలో ఉప‌గ్ర‌హాల‌ను నియంత్రించ‌డం ఎలా అనే సందేహాలు రావొచ్చు.  

Read: క్రిప్టో క‌రెన్సీపై ప్ర‌ధాని కీల‌క వ్యాఖ్య‌లు… వారి చేతుల్లోకి వెళ్తే…

ఉప‌గ్ర‌హాలు డీకొనే విధానాన్ని నివారించే వ్య‌వ‌స్థ‌ను కొలిజ‌న్ అవాయిడెన్స్ మెనూవ‌ర్ అని పిలుస్తారు.  సింపుల్‌గా క్వామ్ అంటారు.  చంద్రుడి ఉత్త‌ర దృవం స‌మీపంలో భార‌త్‌కు చెందిన చంద్ర‌యాన్ 2 వ్యోమనౌక‌, నాసాకు చెందిన ఆర్బిట‌ర్‌లు ప‌ర‌స్ప‌రం డీకొనే అవ‌కాశం ఉండ‌టంతో అప్ర‌మ‌త్త‌మైన ఇస్రో, నాసాలు క్యామ్ విన్యాసాన్ని విజ‌య‌వంతంగా చేప‌ట్టారు.  త‌ద్వారా తృటిలో ప్ర‌మాదం త‌ప్పిన‌ట్టు ఇస్రో ప్ర‌క‌టించింది.  అక్టోబ‌ర్ 20 వ తేదీన చంద్ర‌యాన్ 2, ఆర్బిట‌ర్‌లో ప‌ర‌స్ప‌రం ద‌గ్గ‌ర‌కు వ‌స్తాయ‌ని, డీకొనే అవ‌కాశం ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు ముందుగానే ప‌సిగ‌ట్టారు.  వెంట‌నే చంద్ర‌యాన్ 2కి క్వామ్ విన్యాసం చేప‌ట్టారు.  దీంతో రెండు ఉప‌గ్ర‌హాలు ప‌ర‌స్ప‌రం ఢీకొనే ముప్పు తొల‌గిపోయింది.   భూక‌క్ష్యలో తిరిగే ఉపగ్ర‌హాల‌కు క్వామ్ విన్యాసం చేప‌ట్ట‌డం సాధార‌ణ‌మే అని, కాని, చంద్రుని ఉత్త‌ర దృవం స‌మీపంలో ఇలా క్వామ్ విన్యాసం నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసారి అని ఇస్రో తెలియ‌జేసింది.  

Related Articles

Latest Articles