ఇజ్రాయిల్ అద్భుత సృష్టి: సరిహద్దుల్లో సాయుధ‌రోబోలు…

ఆయుధాల‌ను తయారు చేయ‌డంలో, నూత‌న టెక్నాల‌జీని వినియోగించి రోబోల‌ను త‌యారు చేయ‌డంతో ఇజ్రాయిల్ ముందు వ‌ర‌స‌లో ఉన్న‌ది.  ఆ దేశం త‌యారు చేసిన రాడార్ వ్య‌వ‌స్థ‌ల‌ను ఎన్నో దేశాలు వినియోగించుకుంటున్నాయి.  కాగా, ఇప్పుడు ఇజ్రాయిల్ మ‌రో కొత్త ఆయుధాన్ని త‌యారు చేసింది.  స‌రిహ‌ద్దుల్లో భ‌ద్ర‌త కోసం రోబోటిక్ వాహ‌నాల‌ను త‌యారు చేసింది.  మ‌నిషి అవ‌స‌రం లేకుండా ఈ వాహానాలు స‌రిహ‌ద్దుల్లో పహారా కాస్తుంటాయి.  ఈ రోబోటిక్ వాహ‌నాల్లో రెండు మెషిన్ గ‌న్లు, కెమేరాలు, సెన్సార్లు అమ‌ర్చుతారు.  రెక్స్ ఎంకే 2 పేరుతో సిద్ధం చేసిన ఈ రోబోటిక్ వాహ‌నాల‌ను ఎల‌క్ట్రానిక్ ట్యాబ్ ద్వారా కంట్రోల్ చేస్తారు.  ఇజ్రాయిల్ ప్ర‌భుత్వ సంస్థ ఇజ్రాయిల్ ఎరోస్పేస్ దీనిని త‌యారు చేసింది.  ప్ర‌స్తుతం ఈ సాయుధ రోబో వాహ‌నాల‌ను ఇజ్రాయిల్ స‌రిహ‌ద్దుల్లో వినియోగిస్తున్నారు.  

Read: సీఎం స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం: పోలీసుల‌కు ఉచిత ప్ర‌యాణం…

Related Articles

Latest Articles

-Advertisement-