వార్ డ్రామా ‘పిప్పా’ పోస్టర్ తో ఆకట్టుకుంటున్న ఇషాన్ కట్టర్

షాహిద్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ తొలి సినిమా ‘ధడక్’లో జాన్వీ కపూర్‌తో కలిసి ఆడియన్స్ ని అలరించాడు. ఇప్పుడీ యువ హీరో తన రెండవ చిత్రంగా వార్ డ్రామా చేస్తున్నాడు. ‘పిప్పా’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రోజు ఇషాన్ ఈ రోజు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇండో-పాకిస్తాన్ మధ్య వార్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సినిమాలో తన ఫస్ట్ లుక్‌ రివీల్ చేశాడు. ఈ పోస్టర్‌లో యుద్ధ ట్యాంక్‌ పై నుంచుని భీకరమైన రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇషాన్.

Read Also : “లైగర్” వయోలెన్స్ స్టార్ట్

ఇది ఇషాన్ ఫ్యాన్స్ ని ఉత్తేజ పరిచేలా ఉంది. 45వ అశ్వికదళ ట్యాంక్ స్క్వాడ్రన్ కి చెందిన బ్రిగేడియర్ మెహతా కథ ఆధారంగా ఈ ‘పిప్పా’ సినిమా తెరకెక్కుతోంది. 1971 లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో మెహతా తన సోదరులతో కలిసి తూర్పు భాగంలో పోరాడారు. ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ, ‘ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. ‘షూటింగ్’ మొదలైంది. గాడ్‌స్పీడ్’ అంటూ ట్వీట్ చేశాడు. ఇందులో షాహిద్ కపూర్, కత్రినా కైఫ్, హుమా ఖురేషి, నేహా ధూపియా నటిస్తున్నారు. ఈ వార్ డ్రామాను నిర్మాతలు రోనీ స్క్రూవాలా… సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో కలసి నిర్మిస్తున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-