ప్రియా ప్రకాశ్ కొత్త ఆఫర్స్ వెనుక కారణం అదేనా!?

సినిమాల్లో అవకాశాలు లేని హీరోయిన్లు సోషల్ మీడియాలో గ్లామర్ స్టిల్స్ తో రచ్చ చేస్తుంటారు. కన్నుగీటు పిల్ల ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా అందులో తక్కువేమీ కాదు. ఆమె నటించిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పరాజయం పాలు అవుతుంటే… అవేవీ పట్టించుకోకుండా నెటిజన్లకు తన అందాలను ఎరవేసి పాపులారిటీ పొందడానికి కృషి చేస్తోంది ప్రియా ప్రకాశ్. అంతేకాదు… అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడయాలోనూ బాగానే నానుతోంది. చిత్రం ఏమంటే… కేవలం ఇలా సోషల్ మీడియా సెన్సేషన్ గా మిగిలిపోకుండా, ప్రియా ప్రకాశ్ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి చక్కటి స్ట్రేటజీనే ప్లే చేస్తోందని సన్నిహితులు చెబుతున్నారు.

ఇవాళ చేతిలో సినిమాలు లేని హీరోయిన్లు కూడా తామెవరికీ తీసిపోలేదనే భావన కలగడానికి నలభై లక్షల పారితోషికం తక్కువ లేకుండా అడుగుతున్నారట. కానీ ప్రియా ప్రకాశ్ మాత్రం తన వ్యక్తిగత సిబ్బందికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ తో కలిపి, కేవలం పాతిక లక్షలను మాత్రమే డిమాండ్ చేస్తోందట. ఇలా ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీగా ప్రియా ప్రకాశ్ ఉండటం వల్లే… ఆమె నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమాలు ‘చెక్’, ‘ఇష్క్’ పరాజయం పాలైనా, తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటోందని సమాచారం. తాజాగా ఆమె కిట్ లో మరో మూడు మీడియం బడ్జెట్ చిత్రాలు జమ అయ్యాయని తెలుస్తోంది. ఆ సినిమాల వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. అయితే దీనితో పాటే ఆమె కాస్తంత నటనలోనూ మెరుగుదల కనబరిస్తే, బిగ్ బడ్జెట్ మూవీస్ లో సైతం ఛాన్స్ దక్కుతుందని అంటున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-