ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతారా… అధిష్టానం మనసులో ఏముంది?

ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నారా అంటే అవున‌నే అంటున్నాయి ప్ర‌స్తుత ప‌రిస్థితులు.  కాంగ్రెస్ పార్టీలో చేరే విష‌యంపై ప్ర‌శాంత్ కిషోర్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కున్నా, గ‌త కొన్ని రోజులుగా ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో స‌న్నిహితంగా మెలుగుతున్నారు.  ఇక ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక‌పై అధిష్టానం ఇప్ప‌టికే చ‌ర్చ‌లు మొద‌లుపెట్టింది.  కాంగ్రెస్ కీల‌క నేత‌ల‌తో ఈ విష‌యంపై చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం.  సీనియ‌ర్ నేత‌లు కొంత‌మంది ప్ర‌శాంత్ చేరికను వ్య‌తిరేకిస్తున్నారు.  ప్ర‌శాంత్ కాంగ్రెస్‌లో చేర‌డం వ‌ల‌న ఇబ్బందు వ‌స్తాయ‌ని అంటున్నారు.  కొంత‌మంది మాత్రం ఆయ‌న చేరిక‌ను స‌మ‌ర్ధిస్తున్నారు.  ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితో, పార్టీ సంస్థాగ‌తంగా తిరిగి బ‌లం పెంచుకోవ‌డానికి ఉప‌యోగప‌డుతుంద‌ని చెబుతున్నారు. కొంద‌రు రావాల‌ని, మ‌రికోంద‌రు వ‌ద్ద‌ని చెబుతుండ‌టంతో దీనిపై అధినేత్రి సోనియా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.  

Read: ఆ విష‌యంలో అమెరికా తీరుపై ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు…

Related Articles

Latest Articles

-Advertisement-