మే 30 త‌రువాత కొన‌సాగింపా? స‌డ‌లింపులా?

తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉన్నాయి.  10 గంట‌ల నుంచి తిరిగి తెల్ల‌వారి 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంది.  కేవ‌లం నాలుగు గంట‌ల పాటు మాత్ర‌మే స‌డ‌లింపులు ఉన్నాయి. అయితే, మే 30 వ తేదీతో లాక్‌డౌన్ స‌మ‌యం ముగుస్తుంది.  మే 30 త‌రువాత లాక్ డౌన్ కొన‌సాగిస్తారా లేదంటే ఎత్తివేస్తారా అనే విష‌యంపై ఈ నెల 30 వ తేదీన ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  లాక్‌డౌన్‌ను అమ‌లు చేయ‌డం వ‌ల‌న కొంత‌మేర క‌రోనా కేసులు అందుబాటులోకి వ‌చ్చాయి.  మే 30 వ తేదీ త‌రువాత కూడా లాక్‌డౌన్ అమ‌లు చేసే అవకాశం ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  అయితే, స‌డ‌లింపు స‌మ‌యం కొంత‌మేర పెంచే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  జూన్ నెల నుంచి వ్య‌వ‌సాయ ప‌నులు ప్రారంభం అవుతాయి కాబ‌ట్టి వ్య‌వ‌సాయ ప‌నుల కోసం, వ్య‌వ‌సాయానికి సంబందించిన వాటిని కొనుగోలు చేయ‌డం కోసం లాక్‌డౌన్ స‌డ‌లింప స‌మ‌యం పెంచే అవ‌కాశం ఉన్న‌ది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-