2022లో ఎన్టీఆర్ రిలీజెస్ ఎన్ని!?

2018 అక్టోబర్ లో ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ విడుదల అయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చే జనవరిలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు జూనియర్. గత మూడేళ్లుగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కే పూర్తిగా అంకితమయ్యాడు ఎన్టీఆర్. ఇందులో తనతో కలసి నటించిన రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో పాటు సమాంతరంగా ‘ఆచార్య’ పూర్తి చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం వేరే ఏ సినిమా చేయలేదు. మూడేళ్ళకు పైగా వచ్చిన గ్యాప్ ని వచ్చే ఏడాది 2022లో ఫిల్ చేసుకోబోతున్నాడు జూనియర్. ఆ ఏడాది రెండు సినిమా రిలీజ్ లపై కన్నేశాడు.

ఎన్టీఆర్ అభిమానులకు పండగలాంటి వార్త ఇది. యంగ్ టైగర్ 2022లో రెండు సినిమాలను ప్రారంభించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించే ఎన్టీఆర్ 30 ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అక్టోబరుకి షూటింగ్‌ పూర్తి కానుంది. ఆ వెంటనే ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ సినిమా చేయనున్నాడు. ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ చిత్రం అక్టోబర్ లో మొదలు కానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ‘సాలార్’ తీస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్31ని నిర్మించనుంది. ఆ తర్వాత ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్‌ సినిమా ఉంటుంది. అయితే 2022లో ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమాలు రెండు విడుదల అవటం ఖాయం. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7, 2022న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ కానుంది. ఇక కొరటాల సినిమా కూడా వచ్చే సంవత్సరాంతంలో విడుదల అవుతుంది. ఇక 2023లో ఎన్టీఆర్ సినిమాలు రెండు రిలీజ్ కావటం ఖాయం. ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలసి యూరప్‌లో పర్యటిస్తున్నాడు.

Related Articles

Latest Articles