అవాంతరాలను దాటేసిన “ఆర్సీ 15″… టైటిల్ ఇదే?

లాంఛనంగా ప్రారంభం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విజనరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ రొమాన్స్ చేయనుంది. ఈరోజు ఉదయమే సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినిమాకు మెగాస్టార్ ఫస్ట్ క్లాప్ కొట్టగా, రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, కియారా అద్వానీలతో పాటు, అంజలి, జయరామ్, నవీన్ చంద్ర, కామెడీ స్టార్ సునీల్ కూడా సహాయక పాత్రల్లో నటించారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో రూపొందుతున్న 50వ ప్రాజెక్ట్ ఇది. ఇది పలు భారతీయ భాషలలో పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది.

Read Also : బిగ్ బాస్-5 : ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది తనేనా ?

“ఆర్సీ 15” టైటిల్ ఇదే ?
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ పేరు చక్కర్లు కొడుతోంది. బజ్ ప్రకారం “విశ్వంభర” అనే టైటిల్ ను అనుకుంటున్నారట. అయితే ఆ టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదని, కేవలం మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. “విశ్వంభర” అంటే ధరిత్రి, భూమి, నేల అని అర్థం వస్తుందట. టైటిల్ లోనే పాజిటివ్ వైబ్స్ ఉండడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఫైనల్ గా సినిమాకు ఏ టైటిల్ ఖరారు చేస్తారు అనేది చూడాలి. తాత్కాలికంగా ఈ ప్రాజెక్ట్ ను #RC15 అనే టైటిల్ తో పిలుస్తున్నారు.

“ఆర్సీ15″కు అడ్డంకులు
కొంతకాలం క్రితం ఈ సినిమాను ప్రకటించినప్పటికీ ఇటీవల కాలంలో శంకర్ వివాదాల్లో చిక్కుకోవడంతో అసలు సినిమా ఉంటుందా ? లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. గతవారమే సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు శంకర్ పై ఫిర్యాదు చేస్తూ చెన్నైలో ఉన్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చిన్నసామి సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ (SIFWA)ని సంప్రదించాడు. అతను తన స్క్రిప్ట్‌ను శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ దొంగిలించారని పేర్కొన్నాడు. అయితే శంకర్ ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. గతంలో విజయ్ కోసం చిన్నసామి ఈ స్క్రిప్ట్ రాశాడట. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ కోసం పని చేసారు. ప్రస్తుతం ఆ వివాదం సద్దుమణగడంతో యాక్షన్‌తో నిండిన సామాజిక డ్రామా “ఆర్సీ15” ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్ళింది. మొత్తానికి అవాంతరాలను దాటుకుని తమ హీరో ప్రారంభోత్సవం లాంఛనంగా జరుపుకోవడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. “ఆర్సీ15 లాంచ్ డే” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే “ఆర్సీ 15” హాలీవుడ్ రేంజ్ లో ఉండడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-