రైతు చ‌ట్టాలు స‌రే .. రేపు ఆర్టిక‌ల్ 370 పై కూడా ఉద్య‌మం చేస్తారా?

కేంద్రం తీసుకొచ్చిన రైతు చ‌ట్టాల‌పై గ‌త ఏడాది కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు.  ఢిల్లీ శివారు ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన రైతులు దీక్ష‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  కాగా, కేంద్ర స‌ర్కార్ తీసుకొచ్చిన మూడు రైతు చ‌ట్టాల‌ను ఈరోజు వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  

Read: చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం: ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి వ‌స్తా…

శీతాకాల స‌మావేశాల్లో దీనిపై ప్ర‌క‌ట‌న చేసి వెన‌క్కి తీసుకుంటామ‌ని ప్ర‌ధాని మోడీ తెలిపారు.  రైతులు చేసిన పోరాటం ఫ‌లించింద‌ని ప్ర‌తిప‌క్షాలు చెబుతున్నాయి.  అయితే, రైతు చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా చేసిన పోరాటం మాదిరిగానే జ‌మ్మూకాశ్మీర్‌కు ప్ర‌త్యేక అధికారాలు అందించే ఆర్టిక‌ల్ 370ని తిరిగి తీసుకొచ్చేందుకు జ‌మ్మూకాశ్మీర్ నేత‌లు పోరాటం చేసే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు.  కేంద్రం తీసుకొచ్చిన చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డం మొద‌లుపెడితే న‌చ్చ‌ని ప్ర‌తి చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకునే వ‌ర‌కు పోరాటాలు జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.  

Related Articles

Latest Articles