దేవిశ్రీ ప్రసాద్ కల నెరవేరేనా!?

ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. తెలుగులో టాప్ హీరోలందరి సినిమాలకు పని చేసి మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు దేవి. తాజాగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తెలుగునాటనే కాదు తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో పలు చిత్రాల్లో దేవి పాటలను ఉపయోగించుకుని హిట్ కొట్టారు. ‘రెడీ’ సినిమాలో దేవి పాట ‘రింగ రింగ’ను ‘థింక చక థింక చక’ పేరుతో, ‘మాగ్జిమమ్’ మూవీలో ‘అ అంటే అమలాపురం’ను సేమ్ టు సేమ్, ‘జై హో’లో ఓ పాటను, బెంగాలీ చిత్రం ‘బిందాస్’లో ‘పండగలా దిగి వచ్చావు..’ పాటను, ‘భాగ్ జానీ’లో ‘ఆకలేస్తే అన్నం పెడతా’ పాటను, ‘రాధే’లో ‘సీటీమార్’ పాటను వాడేశారు.

ఇక ‘సర్కస్’ సినిమా కోసం దేవి రెండు పాటలను కంపోజ్ చేశారు. ఇదిలా ఉంటే ఇలా ఒకటి రెండు పాటలను ఉపయోగించుకోవడంపై దేవిశ్రీప్రసాద్ తన అసంతృప్తిని కూడా వెళ్ళగక్కాడు. మ్యూజిక్ డైరెక్టర్ కి కంప్లీట్ కార్డ్ ఇవ్వాలనేది దేవిశ్రీ డిమాండ్. ఇక ఇదిలా ఉంటే దేవిశ్రీప్రసాద్ కి తీరని కోరిక ఉందట. అది సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ సినిమాలకు పని చేయటం. అవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ లుగా చెబుతుంటాడు దేవిశ్రీ ప్రసాద్. ఇటీవల బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ కూడా వారిద్దరి సినిమాలు చేయటం తన కలగా చెప్పాడు. మరి దేవిశ్రీ కలను ఆ ఇద్దరూ స్టార్ హీరోలు నెరవేరుస్తారో లేదో చూద్దాం.

Related Articles

Latest Articles