పవన్ విమర్శలకు కౌంటర్ రెడీ చేస్తున్న జగన్?

కొద్దిరోజులుగా ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ నడుస్తోంది. ఇరుపార్టీలు ఎవరికీ వారు తగ్గేదెలే అన్నట్లుగా మాటలయుద్ధానికి దిగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిగా పైచేయి సాధించారనే టాక్ విన్పించింది. అయితే దీనికి సీఎం జగన్ మార్క్ కౌంటర్ త్వరలోనే పడబోతుందనే ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. పవన్ ఇష్యూకి సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ఎండ్ కార్డ్ వేస్తారనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఈ ఇష్యూకి సీఎం ఎలాంటి ముగింపు ఇస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపైనే దృష్టిపెట్టారు. ప్రజల సంక్షేమమే ఏజెండాగా ముందుకెళుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు. ప్రజలు జగన్ వైపు ఉన్నారనడానికి కిందటి స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనంగా కన్పిస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ఎన్నికలు జరిగినా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తూ వెళుతోంది. ప్రతిపక్ష పార్టీలు వైసీపీకి కనీస పోటీ ఇవ్వని దుస్థితి నెలకొంది.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు. కానీ అధికారంలోకి వచ్చాక చాలా వరకు సంయమనంతో వ్యవహరిస్తున్నారు. అవసరమైతే తప్ప ప్రతిపక్ష పార్టీలకు పెద్దగా కౌంటర్ ఇవ్వడం లేదు. ఒకరిద్దరు మంత్రులు మాత్రమే ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొడుతున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గత రెండేళ్లలో పవన్ కల్యాణ్ పై ఒకటి రెండుసార్లు మినహా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు.

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్వయంగా రెండుచోట్ల ఓడిపోవడం, ఆపార్టీకి ఒకటే సీటు రావడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఆ పార్టీని ఆయన లైట్ తీసుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ కొద్దిరోజులుగా వైసీపీ సర్కారును టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలు ఆయన మాటల్ని తిప్పుకొడుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్ జగన్ మార్క్ ముగింపు పలుకే అవకాశం ఎక్కువగా కన్పిస్తోంది. పవన్ విమర్శలపై సీఎం జగన్ త్వరలోనే స్పందించే అవకాశాలు కన్పిస్తోంది.

పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఓసారి కామెంట్ చేస్తే ఇప్పటికీ ఆయన నానాయాగి చేస్తున్నాడు. జగన్ ఒకసారి ఆ మాటను పదేపదే చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు జనసేనాని. కాగా కొద్దిరోజులుగా సీఎం జగన్ పాలనపై తప్ప ఎవరీపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. కానీ జనసేనాని పనిగట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో ఆయన విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం కన్పిస్తుంది. త్వరలో పవన్ ఇష్యూకు సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ఎండ్ కార్డు వేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్ విన్పిస్తుంది.

-Advertisement-పవన్ విమర్శలకు కౌంటర్ రెడీ చేస్తున్న జగన్?

Related Articles

Latest Articles