పాపం బాబు.. ఢిల్లీ యాత్రకు అపాయిమ్మెంట్ కూడా దొరకడం లేదా?

టీడీపీ అధినేత చంద్రబాబు ఇమేజ్ క్రమంగా మసకబారుతుందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేసే బాబు గత కొంతకాలంగా రాజకీయంగా విఫలం అవుతున్నారు. ట్రెండ్ తగ్గట్టుగా చంద్రబాబు వ్యూహాలు ఉండకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది. 2020లోనూ పాతకాలం నాటి వ్యూహాలనే చంద్రబాబు నమ్ముకోవడంతో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందనే టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఇమేజ్ ఏపీలోనే కాకుండా ఢిల్లీ స్థాయిలోనూ డ్యామేజ్ అవుతుండటం శోచనీయంగా మారింది.

ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు ఉండేది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల ముందు చంద్రబాబు అనుసరించిన వ్యూహం బెడిసి కొట్టింది. దీంతో అటూ ఏపీలో, ఇటూ ఢిల్లీలోనూ బాబు ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. దీంతో రెంటింకి చెడ్డ రేవడిలా చంద్రబాబు పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు బాబుకు ఢిల్లీ వెళితే చాలా మంది జాతీయ నేతలు ఆయనకు స్వాగతం పలికేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేకపోవడానికి చంద్రబాబు స్వయం కృతాపరాధమేననే తెలుస్తోంది.

కొన్నేళ్లుగా చంద్రబాబు పూటకో పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆతర్వాత వాటిని గాలికొదిలేయడం లాంటివి చేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు ఓడ మల్లమ్మ.. అవసరం తీరాక బోడ మల్లమ్మ అన్నట్లుగా ఆయన వ్యహరిస్తున్నారు. దీంతో ఆయనపై జాతీయ స్థాయి నాయకులకు సైతం నమ్మడం లేకుండా పోతుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి కూటమి కట్టిన బాబు ఆ తర్వాత పత్తాకు లేకుండా పోవడం ఇందుకు నిదర్శంగా కన్పిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సైతం ఇటీవల కాలంలో చంద్రబాబును దూరంపెడుతూ వస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆహ్వానాలు ఏమి వెళ్లడం లేదు. ఇక బీజేపీ సైతం చంద్రబాబును నమ్మడం లేదు. ఇప్పటికే ఆయన బీజేపీని మూడుసార్లు ముంచారని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆయన్ని చేరదీయడం లేదు. అదేవిధంగా జాతీయ స్థాయి నేతలైన మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్లు సైతం బాబును దూరంగా పెడుతున్నారు.

కాగా ఇటీవల టీడీపీ ప్రధాన కార్యాలయంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. దీనిని ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో దీక్షలు చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న దాడులను వివరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయ్మింట్ చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబుకు మునుపటిలా అపాయింట్మెంట్ దొరకడం లేదని టాక్. దీంతో ఒక ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇచ్చే ఫిర్యాదులను హోమంత్రి స్వీకరించ వచ్చేమోగానీ ఆయన్ని తమతో కలుపుకుపోయే సీన్ లేదని మాత్రం స్పష్టమవుతోంది.

Related Articles

Latest Articles