సాయిధరమ్ తేజ్ గోల్డెన్ అవర్ లో కీరోల్ పోషించింది అల్లు అర్జున్ నా?

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి అందరికీ తెల్సిందే. గడిచిన మూడు రోజులుగా ఆయన ఆరోగ్యంపై పలురకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అభిమానులు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీసున్నారు. మెగాస్టార్ చిరంజీవి.. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. త్వరగానే కోలుకొని ఇంటికి వెళుతాడని మెగాస్టార్ ట్వీటర్లో పోస్టు చేయడంతో అభిమానులు కొంత ఊరట చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సాయిధరమ్ తేజ్ కు అపోలో వైద్యులు కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం తేజు పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు.

సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వేగంగా స్పందించి 108కు సమాచారం అందించారు. ఆ వెంటనే అతడెవరని ఆరా తీయగా అతడి పేరు ‘అబ్దుల్’ అని గుర్తించారు. అతడు స్థానికంగా ఒక షాపింగ్ మాల్ లో వ్యాలెట్ పార్కింగ్ నిర్వహిస్తాడని తెలుస్తోంది. ప్రమాద సమయంలో తేజు పరిస్థితిపై అందరూ అతడి నుంచే వివరాలను సేకరించారట.. సాయిధరమ్ తేజ్ అని గుర్తించగానే అతడిని తరలించేందుకు అంబులెన్స్ వెళ్లేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ‘ఇస్లావత్ గోవింద్’ వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేశారట.. దీంతో వీరిద్దరిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే తేజుకు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం మొదటగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే తెల్సిందట. ఈ విషయాన్ని ఆయన మొదట తన మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖ, అనంతరం పవన్ కళ్యాణ్, ఇతర కుటుంబ సభ్యులకు తెలియజేశారని తెలుస్తోంది.

సాయిధరమ్ తేజ్ గోల్డెన్ అవర్ లో కీరోల్ పోషించింది అల్లు అర్జున్ నా?

తేజుకు యాక్సిడెంట్ జరిగిన వెంటనే అతడిని 108లో మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో అల్లు అర్జున్ కు సంబంధించిన స్నేహితులు ఉండటంతో ఈ విషయం బన్నీకి వెంటనే చేరింది. ఆ సమయంలో అల్లు అర్జున్ కాకినాడలో ‘పుష్ప’ సినిమా షూటింగులో ఉన్నారట. దీంతో తేజూ ఆరోగ్యంపై ఆరా తీస్తూనే మెగాస్టార్ చిరంజీవికి ఈ విషయాన్ని తెలియజేశారట. ఆ తర్వాత మిగతా కుటుంబ సభ్యులైన పవన్ కల్యాణ్, రాంచరణ్ లను అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది.

బన్నీ ఇచ్చిన సమాచారం మేరకు మెగా కుటుంబ సభ్యులు మెడికవర్ ఆస్పత్రికి వెళ్లి తేజు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం తేజును చిరంజీవి అపోలోకు తరలించినట్లు తెలుస్తోంది. నిన్ననే అతడికి అపోలో కాలర్ బోన్ సర్జరీని చేశారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం అవడంతో తేజు ప్రస్తుతం ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకున్నాడు.

సాయిధరమ్ తేజు రోడ్డు ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. తేజ్‌పై ఐపీసీ 336, 279, మోటార్‌ వాహన చట్టం 184 కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆరోజు రాత్రి సుమారు 8.20 గంటలకు ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు అబ్దుల్‌ ఫరాన్‌, ఆసీఫ్‌లను పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా బైక్‌ వేగాన్ని అంచనా వేస్తున్నామని పోలీసులు తెలిపారు. అదేవిధంగా ప్రమాద స్థలంలో రోడ్డుపై ఇసుక ఉండటంతో టీఎస్ఐఐసి(ఐలా) అధికారులకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. తేజు ప్రమాదం తర్వాత కీలకమైన గోల్డెన్ అవర్ లో కీరోల్ పోషించింది అల్లు అర్జునే అని తెల్వడంతో ఫ్యాన్స్ అతడి సమయ స్పూర్తిని మెచ్చుకుంటున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-