వాక్సిన్ అవకతవకల పై నిమ్స్ లో ముగిసిన విచారణ…

వాక్సిన్ అవకతవకల పై నిమ్స్ లో విచారణ ముగిసింది. డైరెక్టర్ ఆదేశాలతో విచరణ చేపట్టారు మెడికల్ సూపరేండ్డెంట్ ఎన్వీ సత్య నారాయణ. ఈ విహారంలో తన సంతకం ఫోర్జరీ చేశారంటూ వివరణ ఇచ్చారు కృష్ణరెడ్డి. వాక్సిన్ వేసేముందు ఐడీ కార్డు, ఆధార్ పరిశీలించకుండా ఎలా ఇచ్చారంటూ నిలదీశారు. మార్చి,ఏప్రిల్ లో వాక్సిన్ వేసుకున్న అందరి వివరాలను ఆన్లైన్ లో ఎందుకు రిజిష్టర్ చేయలేదని ప్రశ్నించారు.మరో మూడు రోజుల్లో విజిలెన్స్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించనున్నారు అధికారులు. అయితే ఈ నివేదిక తరవాత సంబంధిత అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. నిమ్స్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో 7వేల మంది ఆన్హర్హులకు వ్యాక్సిన్ పంపిణీ చేసారు. 7వేల మందికి ఫాస్ట్ డోస్ తర్వాత సర్టిఫికెట్ రాలేదు. దాంతో రెండో డోస్ వేయించుకోవాలంటే అయోమయోయ పరిస్థితి ఏర్పడింది. నకిలీ ప్రూఫ్ లతో వ్యాక్సిన్ వేయించుకోవడంతో రికార్డుల తారుమారు అయ్యాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-