‘కృష్ణమనోహర్, ఐపీఎస్’కి ఫ్యానైపోయిన… 22 ఏళ్ల యువ ఐపీఎస్ ఆఫీసర్!

సఫీన్ హసన్ ఓ ఐపీఎస్ ఆఫీసర్. 22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ ఎగ్జామ్ క్రాక్ చేశాడు. గుజరాత్ లోని ఓ చిన్న పల్లెటూర్లో పుట్టినా, పేదరికం అడ్డుపడినా, అన్ని అవాంతరాలు దాటుకుని ఐపీఎస్ అయ్యాడు. అంతే కాదు, సఫీన్ హసన్ ఇండియా మొత్తంలోని యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా!
హసన్ కు దక్షిణాదిలో అభిమాన హీరో ఎవరో తెలుసా? మన మహేశ్ బాబే! తను గుజరాతీ అయినా, పెద్దగా సూపర్ స్టార్ సినిమాలు చూడకపోయినా, ఆయనంటే అభిమానమట! కారణం… ప్రిన్స్ గురించి ఆయన సన్నిహితులు హసన్ కి చెప్పిన మాటలే!
యువ ఐపీఎస్ ఆఫీసర్ గా రికార్డు సృష్టించిన హసన్ తన ఇస్ స్టాగ్రామ్ చాట్ లో మహేశ్ బాబు సేవా కార్యక్రమాల గురించి మాట్లాడాడు. నేరుగా ఆయన చేస్తోన్న పనుల గురించి చెప్పకపోయినా మహేశ్ బాబు సన్నిహితులు తనకు చెప్పిన విషయాల వల్ల అభిమానిని అయ్యాను అంటూ స్పందించాడు. మన ‘శ్రీమంతుడు’ ఇప్పటికే ఆంధ్రాలో ‘బుర్రిపాలెం’, తెలంగాణలో ‘సిద్ధాపురం’ గ్రామాల్ని దత్తత తీసుకుని వాట్ని స్వంత డబ్బులతో అభివృద్ది చేస్తున్నాడు. ఈ మద్యే బుర్రిపాలెంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయించాడు. మరో వైపు, దాదాపు వెయ్యి మంది పిల్లలకు గుండె సంబంధమైన ఆపరేషన్లు పూర్తి ఉచితంగా చేయించాడు! ఇవన్నీ నచ్చటం వల్లే, సఫీన్ హసన్, ద యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా… మన ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’కి ఫ్యాన్ అయ్యి ఉంటాడు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-