పోస్టర్ : అడవి ‘పుష్ప’రాజ్‌పై ఎక్కుపెట్టిన ఐపీఎస్ ఆఫీసర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో ఆయన ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించనున్నాడు. తాజాగా పుష్పరాజ్ – భన్వర్ సింగ్ షెకావత్ మధ్య ఆకట్టుకొనే యుద్ధ సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈమేరకు వీరిద్దరి పోస్టర్ ను విడుదల చేశారు. ఐపీఎస్ భన్వర్ సింగ్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నున్నటి గుండుతో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో క్రిస్మస్ సందర్బంగా డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు.

Image
-Advertisement-పోస్టర్ : అడవి ‘పుష్ప’రాజ్‌పై ఎక్కుపెట్టిన ఐపీఎస్ ఆఫీసర్

Related Articles

Latest Articles