ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ సెప్టెంబర్‌ 19 నుంచి దుబాయ్లో తిరిగి ప్రారంభం కానుంది. డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ మరియు మూడుసార్లు ఐపీఎల్‌ విజేత గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ రెండో దశ మ్యాచ్‌ లు పునః ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 10న జరిగే తొలి క్వాలిఫయర్‌ కు దుబాయ్‌ ఆతిథ్యం ఇవ్వనుండగా… అదే నెల 11, 13 వ తేదీల్లో జరిగే ఎలిమినేటర్‌, 2వ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ లకు షార్జా ఆతిథ్యం ఇవ్వనుంది. ఐపీఎల్‌ రద్దు కావడానికి ముందు చెన్నై, ముంబై జట్లు తలపడగా.. రోహిత్‌ సేన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా.. ఐపీఎల్‌ లీగ్‌ తర్వాత యూఏఈ వేదికగానే టీ-20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌ లు కూడా జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ లు అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు జరుగుతాయి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-