ఐపీఎల్ 2022 : 8 జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్ళే…

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్ వెల్, సిరాజ్ ను రిటైన్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… 15 కోట్లతో కోహ్లీ, 11 కోట్లతో మాక్స్ వెల్, 7 కోట్లతో సిరాజ్ ను తీసుకున్న బెంగళూరు.. ఇంకా 57 కోట్లతో వేలానికి రానున్న ఆర్సీబీ

ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ ను రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్… 16 కోట్లతో రోహిత్, 12 కోట్లతో బుమ్రా, 8 కోట్లతో సూర్య, 6 కోట్లతో పొలార్డ్ ను వెనక్కి తీసుకున్న ముంబై.. ఇంకా 48 కోట్లతో వేలానికి రానున్న ముంబై

పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్, హర్ష దీప్ సింగ్ ను రిటైన్ చేసుకున్న పంజాబ్… 12 కోట్లతో మయాంక్ … 4 కోట్లతో హర్ష దీప్ ను తమతో పెట్టుకున్న పంజాబ్.. ఇంకా 74 కోట్లతో వేలానికి రానున్న కింగ్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ ను రిటైన్ చేసుకున్న హైదరాబాద్… 14 కోట్లతో విలియమ్సన్… చెరో 4 కోట్లతో అబ్దుల్, మాలిక్ ను వెనక్కి తీసుకున్న సన్‌రైజర్స్.. ఇంకా 68 కోట్లతో వేలానికి రానున్న హైదరాబాద్

చెన్నై సూపర్ కింగ్స్ : ధోని, జడేజా, మోయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ ను రిటైన్ చేసుకున్న సూపర్ కింగ్స్… 16 కోట్లతో జడేజా, 12 కోట్లతో ధోని, 8 కోట్లతో మోయిన్, 6 కోట్లతో గైక్వాడ్ ను తమతో ఉంచుకున్న చెన్నై.. ఇంకా 48 కోట్లతో వేలానికి రానున్న సూపర్ కింగ్స్

ఢిల్లీ క్యాపిటల్స్ : రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే ను రిటైన్ చేసుకున్న ఢిల్లీ … 16 కోట్లతో పంత్… 9 కోట్లతో అక్షర్, 7.50 కోట్లతో పృథ్వీ, 6.50 కోట్లతో నార్ట్జే ను తన చెంత ఉంచుకున్న ఢిల్లీ… ఇంకా 51 కోట్లతో వేలానికి రానున్న క్యాపిటల్స్

కోల్‌కతా నైట్ రైడర్స్ : ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్ ను రిటైన్ చేసుకున్న కోల్‌కతా … 12 కోట్లతో రస్సెల్… చెరో 8 కోట్లతో వరుణ్, వెంకటేష్ ను అలాగే 6 కోట్లతో నరైన్ ను వెనక్కి తీసుకున్న కేకేఆర్.. ఇంకా 56 కోట్లతో వేలానికి రానున్న నైట్ రైడర్స్

రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ను రిటైన్ చేసుకున్న రాజస్థాన్ … 14 కోట్లతో సంజు… 10 కోట్లతో బట్లర్, 4 కోట్లతో జైస్వాల్ ను తమతో పెట్టుకున్న ఆర్ఆర్… ఇంకా 62 కోట్లతో వేలానికి రానున్న రాయల్స్

Related Articles

Latest Articles