ఏప్రిల్ 2 నుండి ఐపీఎల్ 2022 ప్రారంభం…?

కరోనా కారణంగా ఇండియాలో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ యూఏఈ లో ముగిసింది. కానీ ఐపీఎల్ 2022 పూర్తిగా ఇండియాలోనే జరుగుతుంది అని ఈ మధ్యే బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు ఐపీఎల్ 2022 పై కసరత్తు చేస్తుంది బీసీసీఐ. ఇక తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 15వ సీజన్ ఏప్రిల్ 2, 2022న ప్రారంభించాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు సమాచారం. కానీ అధికారికంగా ఈ తేదీ ఇంకా ఖరారు కాలేదు.

అయితే ఇప్పటివరకు ఐపీఎల్ లో ఎనిమిది జట్ల మధ్య మొత్తం 60 మ్యాచ్ లు జరిగేవి. కానీ ఈ 15వ సీజన్ లో మొత్తం 10 జట్లు మధ్య 74 మ్యాచ్ లు జరగనున్నట్లు సమాచారం. ఇక ఈసారి ఈ లీగ్ 60 రోజులకు పైగా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఏప్రిల్ 2నే గనక ఐపీఎల్ 2022 ప్రారంభం అయితే జూన్ మొదటి వారాంతంలో అంటే జూన్ 4 లేదా 5న
ఈ సీజన్ ఫైనల్స్ జరగవచ్చు. ఇక ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది కాబట్టి ఐపీఎల్ 2022 మొదటి మ్యాచ్ చెపాక్ లోనే జరుగుతుంది అని స్పష్టంగా తెలుస్తుంది.

Related Articles

Latest Articles