ఐపీఎల్‌పై బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం

ఐపీఎల్ అంటేనే హంగామా.. క్రికెట్ ప్రేమికుల‌కు స్పెష‌ల్ కిక్‌.. అయితే, క‌రోనా వైర‌స్ వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.. స్టేడియానికి వెళ్లే ప‌రిస్థితి లేక‌పోయినా.. హోం థియేట‌ర్లు, టీవీల్లో చూసి ఎంజాయ్ చేద్దామ‌న్నా.. కోవిఢ్ మాత్రం.. ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ 14వ ఎడిషన్‌ను పూర్తిగా ముందుకు సాగ‌నివ్వ‌లేదు.. అయితే, మిగ‌తా మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది బీసీసీఐ… సెప్టెంబ‌ర్ 19 నుంచి మ‌ళ్లీ ఐపీఎల్‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. మిగ‌తా టోర్నీ యూఏఈలో నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యానికి రాగా.. ఇక ఫైన‌ల్ మ్యాచ్ అక్టోబ‌ర్ 15న జ‌ర‌గ‌నుంది. దీనిపై.. బీసీసీఐ అధికారులు యూఏఈ బోర్డుతో చ‌ర్చ‌లు జ‌రిపారు.. మిగ‌తా మ్యాచ్‌ల‌ను దుబాయ్‌, అబుదాబి, షార్జాల్లో నిర్వ‌హిస్తామ‌న్న బీసీసీఐలో వెల్ల‌డించారు. కాగా, ఐపీఎల్ 14వ ఎడిష‌న్‌లో ఇప్ప‌టికే 29 మ్యాచ్‌లు జ‌ర‌గ‌గా.. మ‌రో 31 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.. అయితే, ఈ మ్యాచ్‌ల్లో భార‌త ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. విదేశీ ప్లేయ‌ర్స్ పాల్గొంటారా? లేదా ? అనే అనుమానాలు నెల‌కొన్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-