ఐపీఎల్ 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా

ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియ‌న్స్ కు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య అబుదాబి వేదిక‌గా మ్యాచ్ జ‌రుగుతున్న‌ది.  కొద్దిసేప‌టి క్రిత‌మే టాస్ వేయ‌గా, కోల్‌క‌తా జ‌ట్టు టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకున్న‌ది.  ఇప్ప‌టికే ముంబై జ‌ట్టు త‌న మొద‌టి మ్యాచ్‌లో చైన్నైపై ఓట‌మి పాలైంది.  ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో బ‌రిలోకి దిగుతున్న‌ది.  అయితే, కోల్‌క‌తా జ‌ట్టు బెంగ‌ళూరుపై అద్భ‌త‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకొని అదే దూకుడును ఈ మ్యాచ్‌లోనూ ప్ర‌ద‌ర్శించాల‌ని చూస్తున్న‌ది.  రెండు జ‌ట్ల టీమ్ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

కోల్‌క‌తా:  వెంకటేశ్‌ అయ్యర్, శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తిక్‌ (వికెట్‌ కీపర్‌), ఆండ్రూ రస్సెల్‌, సునీల్‌ నరైన్, లాకీ ఫెర్గూసన్‌, వరుణ్‌ చక్రవర్తి, ప్రసిద్ధ్‌ కృష్ణ.

ముంబై: రోహిత్‌ శర్మ (కెప్టెన్), క్వింటన్‌ డి కాక్ ‌(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, సౌరభ్‌ తివారీ, కీరన్‌ పొలార్డ్, కృనాల్‌ పాండ్య, ఆడమ్‌ మిల్నే, రాహుల్‌ చాహర్‌, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌. 

Read: ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం: సచివాల‌యాల్లోనే ఆస్తుల రిజిస్ట్రేష‌న్లు…

-Advertisement-ఐపీఎల్ 2021:  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా

Related Articles

Latest Articles